UPSC | హనుమకొండ చౌరస్తా, జూన్ 18 : తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి సంస్థ అధ్యయన కేంద్రం బంజారాహిల్స్ రోడ్ నెం 14లోని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీఎస్ఎటీ) 2025-26 విద్యా సంవత్సరం ప్రవేశానికి సంబంధించి నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ స్టడీ సర్కిల్ ఉమ్మడి వరంగల్ జిల్లా శాఖా గౌరవ సంచాలకులు డాక్టర్ కొంగర జగన్మోహన్ తెలిపారు.
33 జిల్లాలకు చెందిన నిరుద్యోగులైన, అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై వార్షిక ఆదాయం 3 లక్షలు మించకుండా ఉన్నవారు http://tsstudycircle.co.in వెబ్ సైట్ ద్వారా ఈ నెల 18 నుంచి వచ్చేనెల 7 వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్దులకు జులై 13న రాతపరీక్షా నిర్వహించడం జరుగుతుందని, ప్రవేశ పరీక్షలో పొందిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులకు ప్రవేశం కల్పించనున్నారు. సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షకు 10 నెలల పాటు ఉచిత వసతి, భోజనంతో కూడిన శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అర్హులైన అభ్యర్దులు తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం కల్పించిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.