కాశీబుగ్గ, డిసెంబర్ 20 : వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు నాలుగు రోజులు సెలవులు ఇస్తున్నట్లు కార్యదర్శి బరుపాటి వెంకటేశ్ రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న శనివారం వారాంతపు యార్డు బంద్, 24న ఆదివారం వారాంతపు సెలవు, 25న సోమవారం క్రిస్మస్ పండుగ సెలవు, 26న మంగళవారం బాక్సింగ్‌డే సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నట్లు తెలిపారు. 23న శనివారం జిన్నింగ్ మిల్లుల వద్ద సీసీఐ కొనుగోళ్లు యథావిధిగా ఉంటాయని పేర్కొన్నారు. సెలవులను దృష్టిలో పెట్టుకొని రైతులు వ్యవసాయ ఉత్పత్తులను తీసుకురావద్దని కోరారు. 27వ తేదీ బుధవారం నుంచి క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు.