Sydney Sweeney: తీవ్ర దుమారం రేపుతున్న స్పోర్ట్స్ యాప్ యాడ్
Sydney Sweeney: నటి సిడ్నీ స్వీనీ చేసిన ఓ యాడ్ తీవ్ర దుమారం రేపుతున్నది. క్రీడల్లోని మహిళలను శృంగారభరితంగా చూపిస్తున్నట్లు ఆ యాడ్ ఉందని విమర్శలు వస్తున్నాయి. స్పోర్ట్స్ ట్రేడింగ్‌కు చెందిన నోవిగ్ యాప్‌ను నటి సిడ్నీ ప్రమోట్ చేసింది.
న్యూయార్క్: అమెరికా నటి సిడ్నీ స్వీనీతో చేసిన ఓ యాడ్ తీవ్ర దుమారం రేపుతున్నది. క్రీడల్లోని మహిళలను శృంగారభరితంగా చూపిస్తున్నట్లు ఆ యాడ్ ఉందని విమర్శలు వస్తున్నాయి. స్పోర్ట్స్ మార్కెట్ ట్రేడింగ్‌కు చెందిన నోవిగ్ యాప్‌ను నటి సిడ్నీ ప్రమోట్ చేసింది. ఆ ప్రకటనలో ఆమె దాదాపు నగ్నంగా నటించింది. అయితే ఫుట్‌బాల్‌తో పాటు ఇతర క్రీడా వస్తువులతో ఆమె తన శరీరాన్ని కప్పుకుని ట్రేడింగ్ యాప్‌ను ప్రమోట్ చేసింది. ఇక సోషల్ మీడియాలో అనేక మంది మహిళా అథ్లెట్లు ఆ యాడ్‌ను తప్పుపట్టాడు. మహిళలను అగౌరవపరుస్తున్నారని ఆరోపించారు. నాలుగు సార్లు ఒలింపిక్ స్విమ్మింగ్‌లో గోల్డ్ మెడల్ గెలిచిన ఏరియార్నే టిట్మస్ స్పందిస్తూ ఆ యాడ్‌ను చూస్తున్నప్పుడు ఆవేశం వస్తున్నట్లు ఆమె అన్నారు. స్త్రీ శరీరాలను డబ్బు సంపాదన కోసం వాడుతుంటే, మహిళా క్రీడలు ఎలా వృద్ధి చెందుతాయని ఆమె ప్రశ్నించారు. బ్రిటీష్ స్ర్పింటర్ ఆమే హంట్, యూఎస్ జిమ్నాస్ట్ గ్రేసీ క్రామర్ కూడా ఆ యాడ్‌ను తప్పుపట్టారు. రగ్బీ ప్లేయర్ సోఫీ ఫెల్లా స్పందిస్తూ.. సిడ్నీ నటించిన యాడ్ మహిళలను కించపరిచే రీతిలో ఉన్నట్లు పేర్కొన్నది. నటి స్వీనీ గతంలో రెండు సార్లు ఎమ్మీ అవార్డుకు నామినేట్ అయ్యింది. అమెరికన్ ప్రొఫెషన్ బాక్సర్ క్రిస్టీ మార్టిన్ బయోపిక్‌పై తీసిన క్రిస్టీలో ఆమె నటించింది.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మంచినీళ్లు తక్కువ తాగితేనే కాదు.. మరీ ఎక్కువ తాగినా ఆరోగ్యానికి హానికరమే..!
Nepal PM Balen Shah | భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని.. సోమవారం ప్రధాని మోదీతో చర్చలు
Festivals | పండుగల సమయంలో స్వీట్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా..?
JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

