పర్వతగిరి, ఆగస్టు 12 : గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా బీఆర్ఎస్ పాలన కొనసాగుతున్నదని ఆ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని కొంకపాక-షాపురం గ్రామాల మధ్య రూ.2కోట్ల వ్యయంతో చేపడుతున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమేశ్ మాట్లాడుతూ పల్లెల సమగ్రాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతున్నారన్నారు. అంతర్గత రహదారులతో పాటు ప్రజలకు మేలు కలిగే ప్రతీ కార్యక్రమాన్ని చేపట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రజలు భవిష్యత్తులోనూ దీవించాలని కోరారు. మండల పరిధిలోని గ్రామాలు, ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అభివృద్ధి ప్రణాళికలను రూపొందిస్తూ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులతో గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలను అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్లు చెప్పా రు. నియోజకవర్గ ప్రజలకు నిత్యం అందుబాటు లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి శాయశక్తులా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు కొంకపాకలో రూ.27కోట్లతో అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయించినట్లు వివరించారు.
మిగిలిన పనులను కూడా వేగంగా పూ ర్తి చేయిస్తానని తెలిపారు. కాగా, మండలంలోని ఏనుగల్లు, పెద్ద తండా, చింత నెక్కొండ, కల్లెడ గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కులను కల్లెడలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అరూరి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కమల, జడ్పీటీసీ సింగ్‌లాల్, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు, మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు, సర్పంచ్‌లు వర్కాల రమేశ్, పంజా మహేశ్, అమడగాని రాజు, చింతపట్ల మాలతీ సోమేశ్వర్రావు, గణేశ్, ఎంపీటీసీలు కర్మిళ్ల మోహన్‌రావు, లావణ్యారావు, మాడ్గుల రాజు, మండల రైతుబంధు సమితి కోఆర్డినేటర్ చినపాక శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్లు గొర్రె దేవేందర్, మనోజ్‌కుమార్‌గౌడ్, వరంగల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పట్టాపురం ఏకాంతంగౌడ్, జిల్లా కోఆప్షన్ మెంబర్ మహ్మద్ సర్వర్మియా, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుమార్, నాయకులు ఎల్లాగౌడ్, మధుసూదన్‌రావు, రాయబారపు వివేక్‌కుమార్, రవి, రఘుపతిరావు పాల్గొన్నారు.
కేయూ విద్యార్థికి ఆర్థిక సాయం
హనుమకొండ చౌరస్తా : పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండలం పెరికేడు గ్రామానికి చెందిన ఏ రంజిత్(కేయూ విద్యార్థి ఉద్యమ నాయకుడు) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతు న్న విషయం తెలుసుకొని అరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ ద్వారా రూ.30వేల ఆర్థికసాయాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అందజేశారు. కార్యక్రమంలో కేయూ ఉద్యమ జేఏసీ నాయకులు సాదు రాజేశ్, చిర్ర రాజు, అరూరి రంజిత్, లంక రాజగోపాల్, మంద వీరస్వామి, తిరుపతి యాదవ్, విజయ్‌ఖన్నా, వెంకట్‌రెడ్డి, శరత్చంద్ర, చిరంజీవి పాల్గొన్నారు.