KU | కేయూలో ‘సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్ బిల్డింగ్’కు శంకుస్థాపన
కాకతీయ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో రూ.3.5 కోట్ల వ్యయంతో రుసా నిధుల ద్వారా నిర్మించబోయే ‘సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్ బిల్డింగ్’కు వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.
హనుమకొండ, అక్టోబర్ 22 : కాకతీయ విశ్వవిద్యాలయ క్యాంపస్‌లో రూ.3.5 కోట్ల వ్యయంతో రుసా నిధుల ద్వారా నిర్మించబోయే ‘సెంట్రల్ ఇన్స్ట్రుమెంటేషన్ సెంటర్ బిల్డింగ్’కు వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ భవనం మొత్తం రెండు అంతస్తులతో ప్రతి అంతస్తు 6,786 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంటుందని, రుసా నిధుల ద్వారా పొందిన ఆధునిక పరికరాలను ఈ భవనంలో ఏర్పాటు చేసి, విద్యా, పరిశోధన అవసరాలకు వినియోగించనున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రామచంద్రం, అభివృద్ధి అధికారి వాసుదేవరెడ్డి వెల్లడించారు.
కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు బి.సురేష్‌లాల్, బి. రమ, సుదర్శన్, చిర్రా రాజు, సుకుమారి, ఎం.నవీన్, రుసా నోడల్ ఆఫీసర్ మల్లికార్జునరెడ్డి, వివిధ డీన్లు, ప్రిన్సిపాళ్లు, విభాగాధిపతులు, ప్రాజెక్ట్ అధికారులు, బోధనా బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

