కేసీఆర్ పాలనలో గ్రామాల అభివృద్ధి
తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ హయాంలోనే గ్రామాలు సర్వాంగ సుందరంగా అభివృద్ధి చెందాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు.
- సంక్షేమంలో దేశంలోనే ముందు వరుసలో తెలంగాణ
- పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలి
- హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్
- ఇందిరానగర్‌లో పంచాయతీ భవన నిర్మాణానికి శంకుస్థాపన
ఎల్కతుర్తి, ఆగష్టు 11 : తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ హయాంలోనే గ్రామాలు సర్వాంగ సుందరంగా అభివృద్ధి చెందాయని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. మండలంలోని ఇందిరానగర్‌లో రూ.20లక్షలతో చేపట్టనున్న గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు జడ్పీ చైర్మన్ మారెపల్లి సుధీర్‌కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దేశంలోనే ముందు వరుసలో ఉందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నేడు గ్రామాలు అభివృద్ధి చెందాయంటే సీఎం కేసీఆర్ చొరవతోనేనని తెలిపారు. పల్లెప్రగతి ద్వారా గ్రామానికి ఒక ట్రాక్టర్‌తో పాటు శ్మశానవాటిక, పల్లెప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, హరితహారం, నర్సరీ తదితర పథకాలను ప్రవేశపెట్టడంతో నేడు పల్లెలన్నీ సర్వాంగ సుందరంగా తయారయ్యాయన్నారు.
అంతేకాకుండా అన్ని గ్రామాల్లో పంచాయతీలకు పక్కా భవనాలను నిర్మిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయడంతో ప్రజలకు పరిపాలన సౌకర్యవంతంగా మారిందన్నారు. ఇందిరానగర్‌ను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేశామని, ఇప్పుడు కొత్త పంచాయతీ భవనాన్ని కూడా నిర్మిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ రాక ముందు, తెలంగాణ వచ్చాక గ్రామాలన్నీ ఎలా అభివృద్ధి చెందాయో పరిశీలించాలన్నారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ మేకల స్వప్న, సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్‌గౌడ్, వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ పోరెడ్డి రవీందర్‌రెడ్డి, సర్పంచ్ కడారి రమాదేవి, ఎంపీటీసీ బొంకూరి రజిత, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గొడిశాల సమ్మయ్యగౌడ్, మాజీ ఎంపీపీ మేకల కోమల, నాయకులు అల్లకొండ రాజు, వేముల శ్రీనివాస్, కడారి ప్రసాద్, అంబాల రాజ్‌కుమార్, పంచాయతీ కార్యదర్శి స్వామి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

