నెల్లికుదురు, సెప్టెంబర్ 4 : ఇటీవలి భారీ వర్షాలతో ఎక్కడాలేని విధంగా నెల్లికుదురు మండలంలోని రావిరాల గ్రామం నీట మునిగి సర్వంకోల్పోయిన ప్రజలకు మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ క విత అండగా నిలిచారు. బుధవారం గ్రామంలో పర్యటిం చిన ఆమె వరద బీభత్సానికి కూలిన ఇండ్లు, కొట్టుకపోయిన గొర్లు, ద్విచక్ర వాహనాలు, కట్ట తెగి చుక్క నీరులేని చెరువును పరిశీలించారు. బాధితులను అక్కున చేర్చుకు ని వారి కన్నీళ్లు తుడిచి ఓదార్చారు.
ఇప్పటివరకు ప్రభు త్వం అందించిన సాయంపై ఆరా తీశారు. ఈ సందర్భం గా కవిత మాట్లాడుతూ వరదలతో రావిరాలలో ఇంత విధ్వంసం జరిగినా సీఎం రేవంత్ ఇక్కడికి రాకపోవడం దురదృష్టకరమని, బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ సర్కారు ఘోరంగా వి ఫలమైందన్నారు. గ్రామానికి చెందిన తూళ్ల సాగర్ తమ కుటుంబ సభ్యులతో డాబాపైకి చేరి కాపాడాలంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌ను చూసి తన వాళ్లను అలర్ట్ చేశానన్నారు. గ్రామంలో మంత్రి సీతక్క పర్యటించి ఒక్క పైసా ఇవ్వకపోవడం దా రుణమన్నారు.
ప్రభుత్వం ఇప్పటికైనా నీట మునిగిన పంటలకు ఎకరాకు రూ.50 వేలు, ఇండ్లు కూలిపోయినోళ్లకు ఇండ్లు నిర్మించివ్వాలని, ప్రతి కుటుంబానికి పరిహా రం అందించాలని డిమాండ్ చేశారు. గ్రామంలోని 150 కుటుంబాలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఆమె వెంట మాజీ జడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పరుపాటి వెంకట్‌రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు ఆకుల జగ్గయ్య, శ్రీరామగిరి సొసైటీ చైర్మన్ గుండా వెంకన్న, వైస్ చైర్మన్ భో జ్యానాయక్, నల్లాని నవీన్‌రావు, ముత్యం వెంకన్న గౌడ్, ఎర్రబెల్లి నవీన్‌రావు, ప్రవీణ్‌రావు పాల్గొన్నారు.