లింగాలఘనపురం, జూలై 15 : కాంగ్రెస్ ప్రభుత్వం భేషజాలకు పో కుండా సాగు నీళ్లు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. ఆయన జనగామ జిల్లా లింగాలఘనపురంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల స మావేశంలో మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో మిషన్ భగీరథ పథకం ద్వా రా ప్రజలకు ఇప్పటికీ తాగు నీరందుతున్నదన్నారు.
కేసీఆర్‌కు పేరొస్తుందనే ఈర్ష్యతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ముఖ్యంగా రైతులకు సాగు నీరు ఇవ్వకుం డా ఇబ్బందులకు గురిచేస్తున్నదన్నారు. స్టేఫన్ఘన్పూ ర్ నియోజకవర్గంలో మూడు మోటర్ల ద్వారా సాగు నీరందించే అవకాశమున్నా ఎమ్మెల్యే కడియం శ్రీహ రి తన రాజకీయ చతురతతో ఒక్కదానినే ఆన్ చేయిం చి చేతులు దులుపుకున్నాడన్నారు. ఇప్పటికైనా శ్రీహరి తన పదవికి రాజీనామా చేసి ప్రజా క్షేత్రంలో తన నిజాయతీని నిరూపించుకోవాలన్నారు. కాంగ్రెస్‌లో కలిసిన కడియం తాను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నట్లు చెప్పుకోవడం అవివేకమని ఎద్దేవా చేశారు. ఆయన వెంట పలువురు నాయకులున్నారు.