హైదరాబాద్: స్వల్ప అనారోగ్యంతో కోలుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్న ఉద్యోగ సంఘాల జేఏసీ మాజీ అధ్యక్షుడు, కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్‌ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు పరామర్శించారు. హైదరాబాద్‌లోని దేవీప్రసాద్ నివాసానికి వెళ్లిన హరీశ్‌రావు.. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
అంతకుముందు ఇటీవల అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకున్న బీఆర్ఎస్ సీనియర్ నేత క్యామ మల్లేశ్‌ను కూడా హరీశ్‌రావు పరామర్శించారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మల్లేశ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని తిరిగి ప్రజల్లోకి రావాలని హరీశ్‌రావు ఆకాంక్షించారు.
ఈ పరామర్శల్లో మాజీ హోంమంత్రి మహమూద్‌అలీ, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.