భువనగిరి అర్బన్, ఆగస్టు 08 : బీఆర్ఎస్ యాదాద్రి భువనగిరి జిల్లా నాయకుడు డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ జన్మదిన వేడుకలను శనివారం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ర్యాకల శ్రీనివాస్‌తో పార్టీ నాయకులు కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ ర్యాకల శ్రీనివాస్ నిత్యం ప్రజలతో మమేకమై ఉంటూ, వారి సమస్యలను తన సమస్యలుగా భావించి ప్రజల కోసం ముందుండే నాయకుడని అన్నారు. భవిష్యత్‌లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడుతూ రాజకీయ జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ర్యాకల శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై అభిమానంతో జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనపై ప్రజలు చూపిస్తున్న అభిమానం, నమ్మకం తనకు ఎంతో ప్రత్యేకమన్నారు.
ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు సాగుతూ, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టేందుకు కృషి చేస్తానని తెలిపారు. వేడుకల్లో భాగంగా పార్టీ కార్యాలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పట్టణ, మండల అధ్యక్షులు ఏవి.కిరణ్ కుమార్, జనగాం పాండు, మండల ప్రధాన కార్యదర్శి నీల ఓం ప్రకాష్ గౌడ్, భువనగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, చందుపట్ల పిఎసిఎస్ మాజీ చైర్మన్ బల్గూరి మధుసూదన్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ బీరు మల్లయ్య, సర్పంచ్ జక్క రాఘవేందర్ రెడ్డి, నాయకులు సందెల సుధాకర్, కేశవపట్నం రమేష్, కస్తూరి పాండు, బాతుక అశోక్, కుతాడి సురేష్, మూలే నాగేంద్రబాబు, కంకల మహేష్, లింగస్వామి పాల్గొన్నారు.