హైదరాబాద్ : హైదరాబాదులోని ప్రసాద్ ల్యాబ్ లో డైరెక్టర్ లిఖిత్ తిరునగరి రూపొందించిన నో లాంగర్ హ్యుమన్ ( No Longer Human ) షార్ట్ ఫిలిమ్‌ను చూసి ,చిత్ర బృందాన్ని మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ( Jagadish Reddy ) అభినందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నో లాంగర్ హ్యూమన్ అందరి ఆదరణ పొందాలని, దర్శకుడు లిఖిత్ తిరునగరి మంచి సందేశాత్మక చిత్రాలను తీసి సినీ రంగంలో రాణించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా షార్ట్ ఫిలిం బృందం జగదీష్ రెడ్డి ని మెమోంటో అందజేసి, శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.