సీఎం రేవంత్ రెడ్డి రాకతో రాష్ట్రానికి అరిష్టం పట్టుకుంది.. నోముల భగత్ ఫైర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకతోనే రాష్ట్రానికి అరిష్టం పట్టుకుందని బీఆర్ఎస్ నేత నోముల భగత్ కుమార్ విమర్శించారు. గత శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రజలకు అలువిగాని హామీలను ఇచ్చి దేవుళ్ళపై ఒట్టేసి ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారని.. అందుకే రాష్ట్రంలో అనావృష్టి పరిస్థితి నెలకొందని ఆరోపించారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకతోనే రాష్ట్రానికి అరిష్టం పట్టుకుందని బీఆర్ఎస్ నేత నోముల భగత్ కుమార్ విమర్శించారు. గత శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రజలకు అలువిగాని హామీలను ఇచ్చి దేవుళ్ళపై ఒట్టేసి ప్రజలను రేవంత్ రెడ్డి మోసం చేశారని.. అందుకే రాష్ట్రంలో అనావృష్టి పరిస్థితి నెలకొందని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాశీ వెళ్లి గంగా నదిలో పుణ్య స్నానం చేసి రాష్ట్ర ప్రజలకు, రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు..
వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు సరఫరా చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నోముల భగత్ విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు అందిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 12 గంటలు కూడా సక్రమంగా రైతులకు కరెంటు సరఫరా చేయడం లేదని అన్నారు. రాష్ట్రంలో గోదావరి జలాలు పుష్కలంగా ఉన్నప్పటికీ కాలేశ్వరం పంపులను ఆన్ చేయకుండా రాజకీయ కక్ష సాధింపుకు పాల్పడుతూ రైతులను బలి చేస్తున్నాడని మండిపడ్డారు.
మిగులు జలాల పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోదావరి జలాలను ఆంధ్రకు అప్పనంగా అందజేస్తున్నాడని అన్నారు. కాళేశ్వరం పంపులను ఆన్ చేసి గోదావరి జలాలను ఎత్తిపోస్తే తెలంగాణలో సగభాగం సస్యశ్యామలవుతుందని అన్నారు. గోదావరిలో నీళ్లు ఉన్న ముఖ్యమంత్రి కరెంట్ ఇవ్వకపోవడం వల్లనే రాష్ట్రంలో రైతులు దుర్భిక్ష పరిస్థితి ఎదుర్కొంటున్నారని అన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకతోనే రాష్ట్రానికి అరిష్టం పట్టుకుంది అందుకే రాష్ట్రంలో అనావృష్టి పరిస్థితి నెలకొంది
గత శాసనసభ పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రజలకు అలువిగాని హామీలను ఇచ్చి దేవుళ్ళపై ఒట్టేసి ప్రజలను మోసగించడం జరిగింది.అందుకే రాష్ట్రంలో అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి.… pic.twitter.com/N61e4xfpff
— Nomula Bhagath Kumar (@BagathNomula) August 8, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

