Free Entry | అభిమానులకు గుడ్‌న్యూస్.. టికెట్ లేకుండానే టీమిండియా మ్యాచ్ చూసేయొచ్చు..!
Free Entry : క్రికెట్ అభిమానులకు శ్రీలంక క్రికెట్ (Srilanka Cricket) తీపికబురు చెప్పింది. భారత జట్టుతో జరుగనున్న రెండు టెస్టుల సిరీస్‌ను ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించింది.
Free Entry : క్రికెట్ అభిమానులకు శ్రీలంక క్రికెట్ (Srilanka Cricket) తీపికబురు చెప్పింది. స్వదేశంలో భారత జట్టుతో జరుగనున్న రెండు టెస్టుల సిరీస్‌ను టికెట్ లేకున్నా స్టేడియానికి వెళ్లి ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించింది. ఆగస్టు 15 నుంచి సిరీస్ మొదలుకానున్నందున యువతరానికి క్రికెట్‌పై ఇష్టాన్ని, టెస్టులపై ఆసక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో శ్రీలంక క్రికెట్ ఈ నిర్ణయం తీసుకుంది. టెస్టుకు ఆదరణ తగ్గుతున్న వేళ టికెట్ ఫ్రీ ఎంట్రీ నిర్ణయంతో స్టేడియం నిండుతుందని ఎస్ఎల్సీ భావిస్తోంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2025-26లో కీలకమైన సిరీస్ ఆడుతున్నాయి భారత్, శ్రీలంక. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో వరసగా ఐదు, ఆరు స్థానాల్లో నిలిచిన రెండు జట్లు విజయంతో ముందంజ వేయాలనే కసితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో లంక పర్యటనకు వెళ్లింది టీమిండియా.
వరల్డ్ క్లాస్ బ్యాటర్లతో నిండిన భారత జట్టుతో మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇంకేముంది శ్రీలంక క్రికెట్‌కు టికెట్ల అమ్మకాలతో భారీ ఆదాయం వస్తుందనుకున్నారంతా. కానీ, లంక బోర్డు మాత్రం ఫ్యాన్స్ స్టేడియానికి రండి. ఉచితంగా మ్యాచ్ చూడండి అని ప్రకటించింది. క్రికెట్‌ను ఇష్టపడే వారిని తమ కుటుంబసభ్యులతో కలిసి స్టేడియానికి వచ్చి మ్యాచ్ వీక్షేందుకు వీలుగా ఈ ఫ్రీ ఆఫర్ ఇచ్చింది.
In a media release, SLC laid out entry details for fans to watch the two-Test series for free between Sri Lanka and India.#SLvIND https://t.co/3VJmWOWviq
— Circle of Cricket (@circleofcricket) August 7, 2026
ఈ గేట్ల గుండా..
అంతేకాదు గాలే, కొలంబో స్టేడియంలో ఏ గేటు నుంచి టికెట్ లేని వారిని అనుమతించనున్నారు అనేది కూడా స్పష్టం చేసింది. గేటు నంబర్ 3, 4, 5, 7 నుంచి ఉచితంగా మ్యాచ్ చూసేందుకు వచ్చిన వారిని సిబ్బంది లోపలికి పంపించనున్నారు. టీ20ల రాకతో టెస్టులు చూసేవారి సంఖ్య క్రమేపీ తగ్గుతున్న నేపథ్యంలో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు శ్రీలంక క్రికెట్ వెల్లడించింది.
SLC has announced selected free entry for the two-Test series between Sri Lanka and India, with entry to the grass embankments at the Galle International Cricket Stadium (GICS) and Sinhalese Sports Club (SSC) free to the public. pic.twitter.com/Os4K58YCvp
— Cricinfo (@cricinfo) August 7, 2026
మూడు రోజుల వామప్ మ్యాచ్ అనంతరం ఆగస్టు 15న గాలే స్టేడియంలో శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని భారత్, శ్రీలంక మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. అనంతరం.. ఆగస్టు 23 నుంచి 27 వరకూ కొలంబోలో రెండో టెస్టు నిర్వహించనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ
CJP protest | సీజేపీ నిరసన కోసం అన్నింటినీ బంద్ చేయొద్దు.. కేంద్రానికి సూచించిన సుప్రీంకోర్టు
Ravindra Jadeja | మళ్లీ రంజీ ట్రోఫీలో జడేజా.. టెస్టు సన్నద్ధత అదిరేనా..!
ప్రజల వద్దకే పాలన కోసం జిల్లాలు ఏర్పాటు : గొంగిడి సునీతామహేందర్ రెడ్డి
Wife Stabs Husband’s Private Part | వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. భర్త ప్రైవేట్ భాగంపై కత్తితో భార్య దాడి
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

