కురవి, జూన్ 22 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసి తీరాలని డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చి నా కాంగ్రెస్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉ న్నారన్నారు. మహబూబాబాద్ జిల్లా కురవి మండలం అయ్యగారిపల్లి గ్రామంలో సీరోలు, కురవి మండలాల పార్టీ ముఖ్య కార్యకర్తలతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్యా మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్కు మంచి ఫలితాలు వస్తాయని, అందుకోసం శ్రేణులు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేయడంలేదని ఆరోపించారు. సీఎం ఒక మాట, మంత్రులు ఇంకోమాట, ప్రజాప్రతినిధులు మరోమాట మాట్లాడుతున్నారన్నారు. గ్రా మాల్లో నాయకులు, కార్యకర్తలు కూర్చొని మంచి అభ్యర్థిని నిలబెట్టాలని సూచించారు. ఎమ్మెల్యే, ఎంపీ ఎకడున్నారో తెలియదని, వారికి పదవుల మీద ధ్యాస తప్ప ప్రజలపై లేదన్నారు. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు చెరువులు, చెక్ డ్యాంలు, బ్రిడ్జిలు, రోడ్లు తెగిపోయినా ఇప్పటికీ వాటికి మరమ్మతు చేయలేదని విమర్శించారు. ప్రజలు కాంగ్రెస్కు ఓటేసి పొరపాటు చేశామని బాధపడుతున్నారని తెలిపారు.
కేసులకు భయపడేది లేదన్నారు. కాంగ్రెస్ను నమ్మినందుకు రైతులు అరిగోస పడుతున్నారని, బోనస్, భరోసా రావడం లేదని, కమీషన్లు ఇస్తేనే కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నదని రెడ్యా తెలిపారు. సమావేశంలో పార్టీ మండలాధ్యక్షుడు తోట లాలయ్య, ఏఎంసీ మాజీ చైర్పర్సన్ ఉమా పిచ్చిరెడ్డి, నాయకులు బజ్జారి పిచ్చిరెడ్డి, గుగులోత్ రవినాయక్, సొసైటీ చైర్మన్లు దొడ్డ గోవర్ధన్ రెడ్డి, కొండపల్లి శ్రీదేవి, నామా సైదులు, నూతకి నర్సింహారావు, కత్తెరశాల విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.