నర్సంపేట, డిసెంబర్6: అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. నర్సంపేటలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఉంటే అనేక మందిపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తే బీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేసి అర్ధరాత్రి జైలుకు పంపడాన్ని ఆయన తీ వ్రంగా ఖండించారు.
ఒకవేళ ఎవరైనా చ ట్టాన్ని వ్యతిరేకిస్తే 41 సీఆర్పీ కింద నోటీసులిచ్చి విడుదల చేయాలని, కానీ పోలీసులు అధికార పార్టీకి అండగా ఉంటూ కుట్రపూరితంగా తప్పుడు కేసులు బనాయించడమేంటని ప్రశ్నించారు. ఏడేండ్లు శిక్షకు లోబడి ఉంటే స్టేషన్ బెయిల్ ఇవ్వా ల్సి ఉండగా జైలుకు ఎలా పంపుతారన్నా రు. అంతేగాక 80 ఏండ్ల వృద్ధుడిపై కేసు పెట్టడంపై పోలీసులకు చట్టాలపై అవగాహన ఉందా, లేకుంటే ఈ వ్యవస్థను ఏం చేద్దామనుకుంటున్నా రని పేర్కొన్నారు.
రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ నాయకులను నివాళులర్పించుకోలేని దౌర్భాగ్య పాలన కొనసాగడం ప్ర జాస్వామ్యానికి గొడ్డలి పెట్టన్నారు. ఇలాంటి ఘటనలపై నర్సంపేటలో న్యాయవాదులు నవ్వుతున్నారని, పోలీసుల తీరును బార్ అసోసియేషన్ సైతం ఖండించిందటే ఆ శాఖ పనితీరు ఎలా ఉందో ఊహించుకోవచ్చునన్నారు.
డివిజన్లో జరుగుతున్న పోలీస్ అరాచకాలపై సీపీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు మాత్రం శూన్యమన్నారు. మెడికల్ కాలేజీని మంజూరు చేసి నిర్మాణం చేసిన తననే ప్రారంభోత్సవం నాడు అరెస్ట్ చేయడం సిగ్గుచేటన్నారు. ప్రతి కేసుపై కౌంటర్ కేసులు వేస్తున్నామని, పరిధి దాటిన వారికి రాబోయే రోజుల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు రాయిడి రవీందర్‌రెడ్డి, నాగెల్లి వెంకటనారాయణగౌడ్, డాక్టర్ విద్యాసాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.