నల్లబెల్లి, జూలై : వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం అసరవెల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నేలవెళ్లి రాజు తండ్రి జానయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతుడి పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మృతుడి కుటుంబం సభ్యులను పరామర్శించి అంతిమయాత్రలో పాల్గొన్నారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బానోతు సారంగపాణి, పాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, పాక్స్ వైస్ చైర్మన్ తక్కల్లపల్లి మోహన్ రావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు అజ్మీరా బాసు, మాజీ సర్పంచులు చింత పట్ల సురేష్, నూనావత్ రాజు లతోపాటు మాజీ ప్రజాప్రతినిధులు,గ్రామ పార్టీ నాయకులు అంతిమ యాత్రలో పాల్గొన్నారు.