నర్సంపేట, జనవరి21 : మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కాంగ్రెస్ కొత్త డ్రామాలకు తెర లేపిందని, తాను తీసుకొచ్చిన నిధులకే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కొత్త కాగితం పెట్టి శంకుస్థాపనలు చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలను కాంగ్రెస్ పార్టీ అమలు చేయాలని బీఆర్ఎస్ నర్సంపేట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ చేపట్టారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉన్న చోటునే ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు.
రెండేళ్ల నుంచి నర్సంపేటలో అభివృద్ధి కుంటుపడిందని, గత నిధులన్నీ పోగు చేసుకొని ఎమ్మెల్యే తన సొంత ఏజెన్సీ పేరుతో నాణ్యతలేని సీసీ రోడ్లను వేస్తున్నారని దుయ్యబట్టారు. పాత జీవోలను దొంతి కొత్తవిగా చేశారని గుర్తు చేశారు. మాధన్నపేట మినీ ట్యాంక్‌బండ్ కోసం నిధులు తీసుకొస్తే పనులు చేయకుండా బిల్లులు ఎత్తుకున్న మాధవరెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీలో మట్టి, బెల్లం, మైనింగ్, ఇంటి నంబర్లు, భూక బ్జాల దందా నడుస్తుందని, దానికి సంబంధించిన అన్ని రకాల ఆధారాలను బీఆర్ఎస్ పార్టీ సేకరించిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా 7వ వార్డుకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు చెన్నబోయిన రాజు, బొబ్బ రాజు, పుప్పాల మనోజ్‌తో పాటు మరో 12మంది బీఆర్ఎస్లో చేరగా, పెద్ది కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నల్లా మనోహర్‌రెడ్డి, రాయిడి రవీందర్‌రెడ్డి, డాక్టర్ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, నాగెళ్లి వెంకటనారాయణగౌడ్, మునిగాల వెంకట్‌రెడ్డి, నామాల సత్యనారాయణ, వేనుముద్దల శ్రీధర్‌రెడ్డి, గోనె యువరాజ్, మండల శ్రీనివాస్, నాగిశెట్టి ప్రసాద్, దేవోజు సదానందం, రాయిడి దుశ్యంత్‌రెడ్డి పాల్గొన్నారు.