దుగ్గొండి, మే, 23: దుగ్గొండి మండలంలోని వెంకటపురం గ్రామానికి చెందిన గొర్కటి నరసయ్య, ప్రేమలత దంపతుల కుమార్తె శ్రీలత- అజయ్ వివాహ వేడుకలకు శుక్రవారం నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో నర్సంపేట నియోజకవర్గ యూత్ కన్వీనర్ శానబోయిన రాజ్ కుమార్, మాజీ ఎంపీపీ కాట్ల కోమల భద్రయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నం మొగిలి, సొసైటీ చైర్మన్ ఊరటి మహిపాల్ రెడ్డి, మాజీ ఎంపిటిసి మోహన్ రావు,కందిపెళ్లి శంకర్, గుండెకారి రవీందర్, కామిశెట్టి ప్రశాంత్, ఊరటి రవి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.