స్టేషన్ ఘన్పూర్, నవంబర్ 4 : కేసీఆర్ హయాంలో దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో తల దించుకునేలా తయారైందని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య దుయ్యబట్టారు. మంగళవారం జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని ఇప్పగూడెం, నమిలిగొండ, శివునిపల్లి గ్రామాల్లో మొం థా తుఫాన్ కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులను ఓదార్చారు. అనంతరం శివునిపల్లిలోని జయగార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
సీఎం రిలీఫ్ ఫండ్‌కు వచ్చిన రూ. 60 కోట్ల నిధులను గురుకులాలకు కేటాయించడం సిగ్గు చేటన్నారు. 42శాతం రిజర్వేషన్ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి బీసీలను మోసం చేశారన్నారు. నియోజకవర్గంలో తుపాను కారణంగా నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు ఎమ్మెల్యే కడి యం శ్రీహరికి ధైర్యం సరిపోతలేదని, ఎక్కడ రైతులు అడ్డుకుంటారోనని భయపడుతున్నారని విమర్శించారు. హుస్నాబాద్‌లో మాదిరిగా వరికి ఎకరానికి రూ. 70 వేలు, పాక్షికంగా దెబ్బతిన్న పంటలకు రూ.50 వేలు, పత్తికి ఎకరానికి రూ. లక్ష పరిహారం ఇవ్వాలని డిమాం డ్ చేశారు. వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని చెబుతున్న కడియం శ్రీహరిని వాటిని నెరవేర్చేదాక నిలదీస్తామని రాజయ్య అన్నారు.
నియోజకవర్గానికి ఇంటిగ్రేటేడ్ స్కూల్ మంజూరైందని చెప్పి, ఇప్పటి వరకు తట్టెడు మట్టి తీయలేదని, దేవాదుల కాల్వల్లో పిచ్చి మొక్కలను తొలగించలేదని, లైనింగ్ వర్క్ చేయలేదన్నారు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేవారికి రెండు రోజుల్లో బిల్లు చెల్లిస్తామన్న కడియం స్లాబ్ లెవెల్ పూర్తయినా ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో స్థానిక ఎ న్నికలు ఎప్పుడు వచ్చినా కాంగ్రెస్‌కు రాజకీయ సమాధి తప్పదని రాజయ్య జోస్యం చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మాచర్ల గణేశ్, మహేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రవి, ఆకుల కుమార్, మాజీ సర్పంచ్ సురేశ్, పార్శి రంగారావు, కనకం గణేశ్, పెసరు సారయ్య, గుండె రంజిత్, గుండె మల్లేశ్, గాదె రాజు, చిట్టిబాబు, గుర్రం శంకర్, మారపల్లి ప్రసాద్, ఏసుబాబు, హీరాసింగ్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.