మహబూబాబాద్ రూరల్, నవంబర్ 28 : తెలంగాణ మలిదశ ఉద్యమ చరిత్ర స్మృతులను ప్రతి ఒక్కరూ గుర్తుచేసుకోవాలని మాజీ ఎమ్మెల్యే, దీక్షా దీవస్ మానుకోట జిల్లా ఇన్చార్జి బాలకొండ కోటేశ్వరరావు అన్నా రు. గురువారం మహబూబాబాద్ పట్టణంలోని మాజీ ఎంపీ మాలోత్ కవిత క్యాంప్ ఆఫీస్‌లో దీక్షా దివస్ సన్నాహక సమావేశం లో ఆయన మాట్లాడారు. 2009 నవంబర్ 29న తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ తలపెట్టిన దీక్షతోనే రాష్ట్రం అంతటా ఉద్యమ స్ఫూర్తి నెలకొన్నదన్నారు. ఆనాడు సమైక్య పాలకులపై కేసీఆర్ కఠోర దీక్ష, పట్టుదలతో ఉద్యమం నడిపించారని పేర్కొన్నా రు.
ఈ దీక్షతో అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరం డిసెంబర్ 9న ప్రత్యేక తెలంగాణను ప్రకటించారని, మళ్లీ ఆంధ్రా పాలకులు అ డ్డుకోవడంతో ప్రకటననను వెనక్కి తీసుకున్నారని గుర్తుచేశారు. తెలంగాణ వచ్చుడో, కే సీఆర్ సచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ సారథ్యంలో ప్రత్యేక రాష్ర్టం సాకారమైందని తెలిపారు. మళ్లీ ఆనాటి స్మృతులను, ఉద్యమం నాటి అంశాలను గుర్తుచేసుకోవాలన్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత మాట్లాడుతూ తెలంగాణ ఉ ద్యమ సమయంలో కేసీఆర్ అన్ని వర్గాల ప్ర జలను కలుపుకొని శాంతియుత మార్గంలో రాష్ర్టాన్ని సాధించారని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అనేక పథకాలు ప్రవేశపెట్టి రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేశారని చెప్పారు. కేసీఆర్ వల్లే పంటలు సమృద్ధిగా పండి తెలంగాణ ధాన్యాగారంగా మారిందని పేర్కొన్నారు. ఆనాటి ఉద్యమ చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకునేందుకు దీక్ష దివస్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందు లో ప్రతి ఒక్కరు భాగస్వాములై జయప్రదం చేయాలని కోరారు.
మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ మాట్లాడుతూ పదేళ్లలో కేసీఆర్ దే శంలో ఎక్కడా లేని దళితబంధు, కల్యాణలక్ష్మి, రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యు త్ వంటి అనేక పథకాలు అమలు చేశారని పేర్కొన్నారు. అనంతరం పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించే ప్రాం తాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ము న్సిపల్ వైస్ చైర్మన్ మార్నేని వెంకన్న, ప ర్కాల శ్రీనివాస్‌రెడ్డి, భరత్‌కుమార్‌రెడ్డి, నా యిని రంజిత్‌కుమార్, బీఆర్ఎస్ నాయకు లు బానోత్ రవికుమార్, మంగళంపల్లి కన్న, జేరిపోతుల వెంకన్న, తేళ్ల శ్రీను, షేక్ ఖాదర్బాబాతో పాటు వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.