పర్వతగిరి, జూలై 15 : ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్ఏ)లు ఓటర్లకు అందుబాటులో ఉండాలని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ సూచించారు. ఎన్యుమరేషన్ ఫామ్స్ (ఈఎఫ్) పూర్తి చేయడంలో వారికి సహకరించాలన్నారు. పర్వతగిరి మండలకేంద్రంలో బుధవారం బీఎల్ఏలు, సోషల్ మీడియా కార్యకర్తలతో ఆయన సమీక్ష నిర్వహించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్‌లో ఓటర్లు ఎ దుర్కొంటున్న సమస్యలను బీఎల్వోలతో కలిసి నివృ త్తి చేయాలని, అర్హులైన వారికి ఓటు హక్కు కల్పించే లా చర్యలు తీసుకోవాలన్నారు.
వీలైనంత త్వరగా ఈ ఎఫ్‌ల డిజిటలైజేషన్ పూర్తిచేసే బాధ్యతను సైతం బీఎల్ఏలు తీసుకోవాలని అరూరి సూచించారు. సమావేశంలో వర్ధన్నపేట నియోజకవర్గ సర్, సభ్యత్వ నమో దు ఇన్చార్జి మసూద్, పార్టీ నాయకులు ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు, రంగు కుమార్, మనోజ్‌గౌడ్, లునావత్ కమల, పంతులు, జితేందర్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం అనంతారంలోని 240వ బూత్‌లో కొనసాగుతున్న సర్ ప్రక్రియను సర్పంచ్ తౌటి శ్రీలతా దేవేందర్, ఉప సర్పంచ్ పేర్వారం రత్తో కలిసి అరూరి పరిశీలించారు.