కురవి, జూలై 13 : మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని సూదనపల్లి గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు గాండ్ల లింగయ్య(68) ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ కవిత జడ్పీ చైర్పర్సన్ ఆంగోత్ బిందుతో కలిసి లింగయ్య భౌతికకాయానికి నివాళులు అర్పించారు. లింగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి అధైర్య పడవద్దు మేమంతా అండగా ఉంటామని భరోసా కల్పించారు.
అలాగే అదే గ్రామానికి చెందిన నీలం చంద్రయ్య ఇటీవల మరణించగా మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడు చంద్రయ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు. మండలంలోని నల్లెల్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు షేక్ రంజాన్ సతీమణి వహీదా రంజాన్ ప్రమాదవశాత్తు కిందపడి చేయి విరగి శస్త్ర చికిత్స చేపించుకోగా, అదేవిధంగా గ్రామానికి చెందిన బానోత్ రాజు పక్షవాతంతో బాధపడుతుండగా ఇరువురిని పరామర్శించారు.
ఈ కార్యక్రమంలో అడిదల దేవేందర్, కళమ్మ, బోడ శ్రీను, బాదే నాగయ్య, రామలింగం, దన్సింగ్, వెంకటరమణ, నాగయ్య, కిష్టయ్య, దుస్స మల్సూర్, సుధాకర్, శ్రీను, బండి మాధవయ్య, వెంకటేశ్వర్లు, నరసింహ, నాగమల్లేశ్వర్ రావు, భాస్కర్, గుండెబోయిన సూరయ్య, నల్ల గ్రామ అధ్యక్షుడు నిమ్మలగంటి కృష్ణమూర్తి, రంజాన్ తదితరులు పాల్గొన్నారు.