మహబూబాబాద్ రూరల్, జూలై 11 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ తెచ్చి అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి బీసీలను మోసం చేస్తున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం మానుకోటలోని మాజీ ఎమ్మెల్యే బానో త్ శంకర్‌నాయక్ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన యువగర్జన సభలో ఆమె మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టడానికి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదన్నారు. ఇచ్చి న హామీలను అమలు చేయడానికే సతమతమవుతున్నదన్నారు.
మానుకోట అభివృద్ధికి కేసీఆర్ అనేక నిధులు కేటాయించడం వల్లే అభివృద్ది కండ్లకు కట్టిన ట్టు కనిపిస్తున్నతున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ యువతను మోసం చేసిందని, జాబ్ క్యాలెండర్, రాజీవ్ యువ వికాసం, స్వయం ఉపాధి కల్పన, నిరుద్యోగ భృతి అని చెప్పి ఓ ఒక్కటీ అమలు చేయలేదని మం డిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత మంచి ఆలోచన చేయాలని, కాంగ్రెస్ వైఫల్యాలను తండా వాసుల్లోకి తీసుకెళ్లి చైతన్యం తేవాలన్నారు. సైనికు ల్లా పనిచేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని మాజీ మంత్రి పిలుపునిచ్చారు.
క్యాబినెట్లోనే వర్గపోరు నడుస్తున్నదని, కాంగ్రెస్ అంటేనే కమీషన్ల పాలన అని విమర్శించారు. జిల్లా యువజన అధ్యక్షుడు యాళ్ల మురళీధర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే ఇతర పట్టణాలకు దీటుగా కేటీఆర్ ఐటీ కంపెనీలు తెస్తే కాంగ్రెస్ పార్టీ ఒక్క ఐటీ కంపెనీ కూడా తీసు కురాలేదన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ నాయిని రంజిత్ కుమార్, మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లునావత్ అశోక్ నాయక్, సుధగాని మురళి, దామూనాయక్, వెంకన్న, ఆంగోతు కిషన్ నాయక్, రామచంద్రు, షరీఫ్, నవీన్ నాయక్, మాజీ సర్పంచ్‌లు, యువకులు పాల్గొన్నారు.
సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్ కుటుంబంపై కాదు.. పాలనపై దృష్టిపెట్టాలని మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌పై విషం చిమ్మడం మానుకోవాలన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ అభివృద్ధి శిలాఫలాకాలే ఇంకా కనబడుతున్నాయని, కాంగ్రెస్ వచ్చిన తర్వాత అభివృద్ధి శూన్యమన్నారు. జిల్లాకు వచ్చిన ఆరుగురు మంత్రులు కొత్తగా చేసిందేమీ లేదన్నారు.
గత సెప్టెంబర్‌లో భారీ వర్షాల వల్ల చెరువులు తెగి గండ్లు పడితే ఇంత వరకు మరమ్మతు చేయలేదన్నారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క కేటీఆర్‌ను శాపనార్థ్దాలు పెడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంత భయపెట్టినా, పోలీసులతో కేసులు పెట్టించినా పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో యువత ఓటర్లను చైతన్యం చేయాలన్నారు.