మహబూబాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ) : అంగన్వాడీలకు ఫోన్ల కొనుగోలులో వస్తున్న అవినీతి ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బయటపెట్టాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ డి మాండ్ చేశారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఫోన్ల కుంభకోణంపై ప్రశ్నిస్తుంటే అవినీతి జరగలేదని నిరూపించుకోవాల్సిన మంత్రి సీతక, అందుకు విరుద్ధంగా మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు పంపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
మంత్రి సీతక పనితీరు, ప రిపాలన, అహం, అహంకారం చూస్తుంటే అసహ్యం వేస్తున్నదన్నారు. తెలంగాణ ప్రజలందరినీ ఏకతాటిపైకి తెచ్చిరాష్ర్టాన్ని సా ధించిన మాజీ సీఎం కేసీఆర్‌కు సీతక నో టీసులు పంపడం సిగ్గు చేటన్నారు. సీతక అవినీతి చేయకుంటే తన నిజాయితీని నిరూపించుకోవాలే తప్ప.. ఇలా లీగల్ నోటీసులిస్తే తప్పు ఒప్పవుతుందా? అని ప్రశ్నించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో జరిగిన ఫోన్ల కుంభకోణాన్ని ఆధారాలతో సహా బీఆర్ఎస్ సోషల్ మీ డియా ఇన్చార్జి నిరూపించారని, రూ.6వేలకు పైగా ఉ న్న ఫోన్లకు రూ.14వేలు చెల్లిస్తే అది అవినీతి కాక మరేమిటో సీతక రాష్ట్ర ప్రజలకు వివరించాలన్నారు.
ప్రస్తు తం 5జీ నడుస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా 38వేల పైచిలుకు 4జీ ఫోన్లను కొనుగోలు చేశారన్నారు. ఫోన్లు కొనుగోలు చేసేటప్పుడు అన్ని రకాల కంపెనీలను పిలిచి అన్ని ఫీచర్లతో తక్కువ ధరకు వచ్చే వాటినే కొనుగోలు చేయాలని, జీఎస్టీని కూడా మినహాయించాలని, ఇది ఎకడా అమలు కాలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి న తర్వాత దోచుకోవడం, దాచుకోవడం, ఢిల్లీ పెద్దలకు ముట్టజెప్పడం చేస్తున్నదన్నారు. వెంటనే లీగల్ నోటీసును సీతక్క వెనకి తీసుకొని కేసీఆర్‌కు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే అవినీతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో పదేళ్లు వెనకి పోయిందని సత్యవతి ఆరోపించారు.
చివరి వారంలో గార్లకు కేటీఆర్..
గార్ల : మున్నేరు-పాలేరు లింక్ కెనాల్ జీవో 98 రద్దు కోసం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మహబూబాబాద్ జిల్లా గార్లకు ఈనెల చివరి వారంలో రానున్నారని సత్యవతి రాథోడ్ తెలిపారు. సోమవారం గార్ల మండల రైతులు లింక్ కెనాల్ రద్దుకోసం సత్యవతిని మహబుబాబాద్లోని ఆమె నివాసంలో కలసి వినతి పత్రం ఆందజేశారు. వెంటనే ఆమె కేటీఆర్‌తో ఫోన్లో మాట్లాడి లింక్ కెనాల్‌తో రైతులకు జరుగుతున్న నష్టాన్ని వివరించగా, స్పందించిన ఆయన చివరి వారంలో గార్ల మండలంలో పర్యటించి రైతులతో మాట్లాడతానని, వారికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు సత్యవతి తెలిపారు. మాజీ మంత్రిని కలిసిన వారిలో రైతులు మూడు హరి నాయక్, మూడు మోజానాయక్, బదావత్ చంటినాయక్, సురేశ్, బిక్కు తదితరులున్నారు.