రాయపర్తి : మండలంలోని పలు గ్రామాలలోమాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Former Minister Errabelli) మంగళవారం బీఆర్ఎస్ మండల శ్రేణులతో కలిసి పర్యటించారు. మండల కేంద్రంలోని యాదవ కాలనీలో వృద్ధాప్యం, అనారోగ్య కారణాలతో మృతి చెందిన కసిరబోయిన కొమురయ్య, గుండెబోయిన ఎల్లయ్య, రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కుంట రాజు కుటుంబాలను పరామర్శించారు.
అధైర్య పడొద్దు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఆయన వెంట మండల నాయకులు జినుగు అనిమిరెడ్డి, రంగు కుమార్, గారె నర్సయ్య, పూస మధు, లేతాకుల రంగారెడ్డి, బందెల బాలరాజు, చందు రామ్ యాదవ్, మల్లేష్, చిన్నాల ఉప్పలయ్య తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
Samantha Ruth Prabhu | ముచ్చటగా మూడోసారి.. నందినిరెడ్డితో సామ్ కొత్త ప్రాజెక్ట్.!
Dog Cloning: చనిపోయిన కుక్క జన్యువులతో క్లోనింగ్.. 19 లక్షలు ఖర్చు పెట్టిన చైనీస్ మహిళ