Samantha – Nandini Reddy | స్టార్ బ్యూటీ సమంత, టాలీవుడ్ స్టార్ దర్శకురాలు నందినిరెడ్డితో మళ్లీ చేతులు కలపబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే వీరిద్దరి కలయికలో వచ్చిన జబర్దస్త్(Jabardasth), ఓ బేబీ (Oh Baby) చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ జోడీ మళ్లీ మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. సమంత సొంత ప్రోడక్షన్ అయిన ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమా రీమేక్ కాకుండా ఒరిజినల్ స్క్రిప్ట్‌తో రూపొందనుందని నందిని రెడ్డి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకోచ్చింది. కాగా ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సినిమాల విషయానికి వస్తే.. గతేడాది సిటాడెల్: హనీ బన్నీ అనే వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సామ్. స్పై థ్రిల్లర్‌గా వచ్చిన ఈ వెబ్ సిరీస్‌లో వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటించాడు. రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహించగా.. కే కే మీనన్, సికందర్ ఖేర్, సాకిబ్ సలీం తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.