తొర్రూరు, సెప్టెంబర్ 8 : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన మృతుల కుటుంబాలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం పరామర్శించారు. ఈ సందర్భంగా తొర్రూరు పట్టణ కేంద్రానికి చెందిన పేర్ల పుల్లయ్య, శమంతుల వేణు, చీకటయాపాలెం గ్రామానికి చెందిన పాండవుల బిక్షం, బూర్గుల వెంకటమ్మ, కంటయపాలెం గ్రామానికి చెందిన గోనే చిరంజీవి, చింతలపల్లి గ్రామానికి చెందిన కోడం వెంకట్ రెడ్డి కుటుంబాలను ఆయన కలుసుకున్నారు.
అనంతరం వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించిన ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.