వర్ధన్నపేట, మార్చి 30: ఎన్నికల్లో లబ్దిపొందేందుకు బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం కోల్పోతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలంలోని ఇల్లంద గ్రామంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షు డు తూళ్ల కుమరస్వామి అధ్యక్షతన శనివారం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి మాట్లాడారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వ చ్చిందన్నారు. వంద రోజులు గడిచినా ఒక్క హా మీ అమలు చేయలేదని విమర్శించారు. ప్రజలు, రైతులను మభ్యపెట్టే విధంగా అమలుకు సాధ్యం కాని హామీ లు ఇచ్చిందన్నారు.
ప్రధానంగా రూ.2 లక్షల పంట రుణమాఫీని అమలు చేయకపోవడంతో రైతులు ఎదురుచూస్తున్నారని తెలిపారు. యాసంగి సాగుకు కనీసం సాగునీరు అందించకపోవడంతో వరి పంటలు ఎం డిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత వేసవిలో ప్రజలకు తాగునీరు అందించే పరిస్థితి లేదని ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయకపోతే, తప్పుడు కేసులతో తమ పార్టీ నేతలను ఇబ్బంది పెడితే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ఎర్రబెల్లి హెచ్చరించారు. వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఐనవోలు, పర్వతగిరి, వర్ధన్నపేట మండలాల ఇన్చార్జిగా తానే బాధ్యత తీసుకుంటానని దయాకర్‌రావు కార్యకర్తలకు చెప్పారు.
అనేక పదవులు అనుభవించిన నాయకులు పార్టీని వదిలిపోయినంత మాత్రాన బీఆర్ఎస్కు నష్టమేమీ లేదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నా రు. జిల్లాకు చెందిన పలువురు నాయకులు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశిస్సులతో అనేక పదవులు అనుభవించి, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం కొంతమంది బీఆర్ఎస్ను వీడిపోతున్నారని విమర్శించారు.
కానీ, ఉద్యమ సమయం నుంచి పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలు ఎప్పుడూ పార్టీకి అండగా ఉంటారని స్పష్టం చేశా రు. నాయకులు వెళ్లినంత మాత్రాన కార్యకర్తలు ఏమాత్రం అధైర్య పడొద్దని భరోసా ఇచ్చారు. సమావేశంలో ఎంపీపీ అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మాజీ ఎంపీపీ నూనె భిక్షపతి, మాజీ ఏఎంసీ చైర్మన్లు గోపాల్‌రావు, సంపత్‌రెడ్డి, జిల్లా నాయకుడు తుమ్మల యాకయ్య పాల్గొన్నారు.
రాయపర్తి : ఆరెగూడెంలో శనివారం ఎర్రబెల్లి దయాకర్‌రావు పర్యటించారు. గ్రామానికి చెందిన ఇంగ్లీ యాకయ్య, కడుదుల సోమన్సయ్య ఇటీవల మృతి చెందగా, బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఆయన వెంట బల్లకారి యాక య్య, గాజులపాటి నర్మద ఉన్నారు.