ఆర్టీసీ విలీనంపై ఇక తాడోపేడో.. వరుస ఆందోళనలకు కార్మిక సంఘాల పిలుపు
కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా ఆర్టీసీ కార్మికులను మోసం చేయడంతో వారంతా ఆగ్రహంతో ఉన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఆర్టీసీ విలీనంపై పోరాడాల్సిందేనని, యూనియన్లను పునరుద్ధరించడంతోపాటు ఆర్టీసీని కాపాడేందుకు కోట్లాది బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆయా కార్మిక సంఘాల నేతలు పట్టుబడుతున్నారు.
- 23న ఎస్‌డబ్ల్యూఎఫ్ (సీఐటీయూ) మహాదీక్ష
- 24 నుంచి ఐఎన్టీయూసీ నిరాహార దీక్షలు
హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఒకలా, అధికారంలోకి వచ్చాక మరోలా ఆర్టీసీ కార్మికులను మోసం చేయడంతో వారంతా ఆగ్రహంతో ఉన్నారు. వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఆర్టీసీ విలీనంపై పోరాడాల్సిందేనని, యూనియన్లను పునరుద్ధరించడంతోపాటు ఆర్టీసీని కాపాడేందుకు కోట్లాది బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆయా కార్మిక సంఘాల నేతలు పట్టుబడుతున్నారు. ఈ క్రమంలో వరుస ఆందోళనలు, నిరసనలకు పిలుపునిచ్చారు. కార్మికులతో చర్చించి పోరాట కార్యాచరణ ప్రకటించారు.
23న ఎస్‌డబ్ల్యూఎఫ్ మహా దీక్ష
వచ్చే బడ్జెట్లో ఆర్టీసీకి రూ.10వేల కోట్లు కేటాయించాలని, మహాలక్ష్మి నిధులు, ఇతర రాయితీలు చెల్లించి కార్మికులను ఆదుకోవాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, 2021, 2025 వేతన ఒప్పందాలు అమలుచేయాలని డిమాండ్ చేస్తూ.. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర కమిటీ 23న మహాదీక్షకు పిలుపునిచ్చింది. ధర్నాచౌక్‌లో ఒక్కరోజు ‘మహాదీక్ష’ చేపడుతున్నది. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీకి అప్పగించే విషయంలో ఈ నెల 12న సదస్సు నిర్వహించనున్నది.
24 నుంచి సామూహిక నిరాహార దీక్షలు
అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా.. మ్యానిఫెస్టోలోని హామీలను అమలుచేయాలని డిమాండ్ చేస్తూ.. ఆ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఎస్‌డబ్ల్యూఎఫ్ (ఐఎన్టీయూసీ) 24 నుంచి 26 వరకు సామూహిక నిరాహార దీక్షలు చేపడుతున్నది. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, అపాయింటెడ్ డే ప్రకటించాలని ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజిరెడ్డి డిమాండ్ చేశారు. దీక్షలకు సహకరించాలని వివిధ కార్మిక సంఘాల నేతలకు లేఖలు రాశారు.

ప్రధాన డిమాండ్లు ఇవే..
- ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్టు అపాయింటెడ్ డే ప్రకటించాలి.
- కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ.. వారికి సమానంగా జీతభత్యాలు ప్రకటించాలి.
- ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీనే కొనుగోలు చేసి సబ్సిడీలు ఆర్టీసీకే ఇవ్వాలి.
- మహాలక్ష్మీ పెండింగ్ డబ్బులు రూ.4,700 కోట్లను వెంటనే చెల్లించాలి.
- బకాయిలను చెల్లింపునకు వచ్చే బడ్జెట్లో వన్ టైం మెజర్ కింద రూ.5వేల కోట్లు గ్రాంట్‌గా ఇవ్వాలి.
ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల సమ్మె
- శ్రమకు తగ్గ వేతనం కోసం జనగామలో నిరసన
- ఈఎస్ఐ, పీఎఫ్ వర్తింపజేయాలని డిమాండ్
జనగామ, మార్చి 2 (నమస్తే తెలంగాణ): పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా తమ వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్లు సమ్మె బాటపట్టారు. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ల సంఘం ఆధ్వర్యంలో సోమవారం విధులు బహిషరించి ప్రెస్టన్ గ్రౌండ్లో నిరసన తెలిపారు. వేతనాలు పెంచే వరకు బస్సులు నడిపేది లేదని హెచ్చరించారు. ఈఎస్ఐ, పీఎఫ్ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. అద్దె బస్సులు కదలకపోవడంతో గ్రామీణ ప్రాంతాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. హనుమకొండలో ఎక్స్‌ప్రెస్ డ్రైవర్లకు రూ.21 వేలు, పల్లె వెలుగు డ్రైవర్లకు రూ.20 వేల వరకు వేతనం ఇస్తుంటే జనగామలో మాత్రం తక్కువ వేతనాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వేతనాలు పెంచి భరోసా కల్పించాలని కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

