ఉమ్మడి వరంగల్ జిల్లాను పొగమంచు కమ్మేసింది. శుక్రవారం తెల్లవారుజుమున దట్టమైన పొగమంచు కమ్మేయడంతో వాహనదారులు, ప్రజలు బయటకు వెళ్లేందుకు ఇబ్బందిపడ్డారు. ముఖ్యంగా భూపాలపల్లి, ములుగు, హనుమకొండలో తీవ్ర ప్రభావం కనిపించింది. వాహనాల్లో వెళ్లే వారు లైట్లు వేసుకుని ప్రయాణించాల్సి వచ్చింది.
తెల్లవారుజాము నుంచి తొమ్మిది గంటల వరకు సూర్యుడు బయటకు రాకపోవడం, మంచు కురుస్తూనే ఉండడం ఇబ్బందిని కలిగించింది. ఎటుచూసిన మంచు తెరలతో వాతావరణం ఆహ్లాదకరంగా మారింది. మూడు రోజులుగా తుఫాన్ ప్రభావంతో వానలు పడి శుక్రవారం తేరుకుంది. ఈ క్రమంలోనే పొగమంచు దట్టంగా అల్లుకోవడంతో ధాన్యం రైతులు ఇబ్బందులు పడ్డారు. చలి పెరగడంతో వృద్ధులు, పిల్లలు అవస్థలు పడ్డారు.