మహదేవపూర్(కాళేశ్వరం), ఆగస్టు 1 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లి గ్రామంలోని కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అంతర్భాగమైన లక్ష్మీ(మేడిగడ్డ) బరాజ్‌కు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతున్నది. గురువారం బరాజ్ ఇన్‌ఫ్లో 2,40,460 క్యూసెక్లు ఉండగా, శుక్రవారం 2,30,890 క్యూసెక్లకు తగ్గింది. బరాజ్‌లో మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రస్తుత నీటి ప్రవాహం బరాజ్ రివర్ బెడ్ నుంచి సముద్ర మట్టానికి 91.60మీటర్ల ఎత్తులో ఉందని అధికారులు తెలిపారు. కాళేశ్వరంలో గోదావరి నది ప్రవాహం నిలకడగా ఉంది. ప్రస్తుత నీటి మట్టం సుమారు 3 మీటర్ల ఎత్తులో ఉందని అధికారులు చెప్పారు.