మహదేవపూర్/ వాజేడు/ ఏటూరునాగారం/ మంగపేట/ కన్నాయిగూడెం, జూలై 11: ఛత్తీస్‌గ ఢ్, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో గో దావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. కాళేశ్వరం వ ద్ద ప్రాణహిత 11.720 మీటర్ల ఎత్తులో పుష్కర ఘాట్‌ను తాకుతున్నది. మేడిగడ్డ బరాజ్‌కు వరద పొటెత్తుతున్నది. 8,68,850 క్యూసెక్కుల ప్రవా హం రాగా, మొత్తం 85గేట్లు ఎత్తి అంతే మొత్తం లో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్త్తుత వరద రివర్ బెడ్ నుంచి సముద్ర మట్టానికి 96. 60 మీటర్ల ఎత్తులో ఉంది.
ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కరఘాట్ వద్ద గో దావరి ప్రవాహం 14.480 మీటర్లకు చేరుకుంది. రాత్రివరకు మొదటి ప్రమాద హెచ్చరిక 14. 820 స్థాయికి చేరుతుందని నీటి పారుదలశాఖ అధికారులు తెలిపా రు. మంగపేట మండలం కమలాపురం ఇన్‌టేక్‌వెల్, మంగపేట పుష్కరఘాట్ వద్ద నదీ ప్రవాహం రెండు తీరాలను ఆనుకొని పారుతున్నది. కమలాపురం ఎర్రవాగు, మంగపేట గౌరారం వాగుల్లోని గోదావరి బ్యాక్ వాటర్ కమ్ముకున్నది.
వాజేడు మండలంలోని పేరూరు వద్ద శుక్రవారం 15.360 మీట ర్లు(49 అడుగులు) గోదావరి నీటిమట్టం చేరుకున్నట్లు సీడబ్ల్యూసీ అధికారులు తెలిపారు. పూసూ రు, ముళ్లకట్ట బ్రిడ్జి వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతున్నది. టేకులగూడెం గ్రామశివారులోని హైదరాబాద్- భూపాలపట్నం 163 జాతీయ రహదారిపై వరదనీరు చేరడంతో రేగుమాగు వాగు బ్రిడ్జి నీటమునగడంతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అక్కడ ఉన్న వంతెనను మూసివేసినట్లు ములుగు ఎస్పీ పీ శబరీశ్ ఒక ప్రకటనలో తెలిపారు. వాజేడు-గుమ్మడిదొడ్డి ప్రధాన రహదారిపై సైతం వరద చేరడంతో రాకపోకలు బందయ్యాయి.
కన్నాయిగూ డెం మండలంలోని తుపాకులగూడెం సమ్మక్క బరాజ్‌కు 7,26,510 క్యూసెక్కుల ప్రవాహం వ స్తుండగా, మొత్తం 59 గేట్లు పైకి ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 82.05 మీటర్ల ఎత్తుకు చేరుకున్నది. బరాజ్‌కు ఎగువన ఉన్న దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టులోని మూడు మోటర్లతో గోదావరి నీటి పంపిం గ్ జరుగుతున్నది. రోజుకు మూడు మోటర్లతో 831 క్యూసెక్కుల నీటిని భీంఘనపురం రిజర్వాయర్‌లోకి పంపింగ్ చేస్తున్నారు. గోదావరి ఉధృతి పెరగడంతో పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. కాళేశ్వరం వద్ద స్నానాలు చేయొద్దని సూచించారు.