వరంగల్, సెప్టెంబర్ 6 : నగరంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. పొద్దం తా ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడగా రాత్రివేళ కుండపోత పోసింది. ఒక్కసారిగా కురిసిన వానతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మొన్నటి వర్షాలతోనే లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో మళ్లీ వర్షం పడడంతో ప్రజలు వణుకుతున్నారు.
ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని భయపడుతున్నారు. దీనికి తోడు వినాయకచవితి పండుగ కోసం వివిధ ప్రాంతా ల నుంచి వ్యాపారులు తెచ్చిన పూ జా సామగ్రి అంతా వరద పాలైంది. కొనుగో లు చేసేందుకు బయటకు వచ్చిన జనం కురిసిన భారీ వర్షంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విక్రయించేందుకు తెచ్చిన గణపతి విగ్రహాలు వానకు తడిసిపోయాయి. వరంగల్ చౌరస్తా, పాత బీట్బజార్, సీకేఎం ఆసుపత్రి వీధి, హ నుమకొండ బస్స్టేష న్ రోడ్డు, అంబేద్కర్ భవన్ రోడ్డు, ములుగురోడ్డు జంక్షన్, ఆర్ఈసీ, హంటర్రోడ్ తదితర ప్రాంతాలు వరదనీటితో నిం డిపోయాయి. భారీవర్షంతో బల్దియా అధికారులు అప్రమత్తం అయ్యారు.