గిర్మాజీపేట, ఆగస్టు 28 : ఢిల్లీ లిక్కర్ కేసులో ‘కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం మోడీయే’ అని బీఆర్ఎస్ నాయకులు ఫ్లెక్సీపై రాసి బుధవారం దహనం చేశారు.
లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయగా, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సయ్యద్ మసూద్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు వరంగల్ మండిబజార్‌లో స్వీట్లు పంచుతూ సంబురాలు నిర్వహించాయి.
అనంతరం ఢిల్లీ లిక్కర్ కేసులో కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మోడీయేనని ఆగ్రహం వ్యక్తం చేశాయి. కార్యక్రమంలో అంకూస్, నెల్సన్, అప్రోచ్, ఇంతియాజ్, అబ్బు, రాజ్‌కుమార్, మౌజ్, లక్ష్మీపుష్ప పాల్గొన్నారు.