నల్లబెల్లి, ఏప్రిల్ 06 : మండల కేంద్రంలోని డంపింగ్ యార్డులో మంటలు చెలరేగుతున్నాయి. నల్లబెల్లి గ్రామంలోని డంపింగ్ యార్డులో పంచాయతీ సిబ్బంది ప్రతినిత్యం తడి పొడి చెత్తను తీసుకెళ్లి డంపింగ్ యార్డులో డంపు చేస్తున్నారు. అయితే వేసవిలో ఎండల తీవ్రత ఎక్కువ అవ్వడం వల్ల డంపింగ్ యార్డులో ఉన్న చెత్తకు ఎవరో నిప్పు అంటించారు.
దీంతో మంటలు చెలరేగుతున్నాయి. ఇదే క్రమంలో మంటలు సమీపంలోని మొక్కజొన్న పంటలకు విస్తరించే అవకాశం ఉండంటంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, పంచాయతీ సిబ్బంది స్పందించి మంటలను ఆర్పి వేసి పంటలను కాపాడాలని కోరుతున్నారు.