Financial assistance | హనుమకొండ చౌరస్తా, జులై 16: వరంగల్ జిల్లాలో టైక్వాండో వ్యవస్థాపకుడు, మార్గదర్శకుడు దివంగత సారంగపాణి కుటుంబానికి అండగా నిలిచేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి సీనియర్ టైక్వాండో క్రీడాకారులు కలిసి వచ్చారు. కుటుంబం ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను గుర్తించి సీనియర్ క్రీడాకారులు సమిష్టిగా రూ.1,12,101 మొత్తాన్ని సేకరించి ఆ కుటుంబానికి బుధవారం అందజేశారు.
వరంగల్ జిల్లా టైక్వాండో అధ్యక్షుడు ఎల్లావుల కుమార్‌యాదవ్, ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి ఖలీష్యాదవ్, సీనియర్ క్రీడాకారులు కె.భాస్కర్, ఈ.గణేష్‌యాదవ్, జి.దిలీప్, ఈ.గౌతమ్యాదవ్, కె.రమేష్, ఎల్.రాంబాబు, సీ.సన్నీ సమక్షంలో సారంగపాణి కుటుంబానికి ఈ విరాళాన్ని అందజేశారు. సారంగపాణి మృతికి టైక్వాండో క్రీడాకారులు సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.