తొర్రూరు, జూలై 6 : తొర్రూరులో వ్యవసాయ శాఖలో ముడపుల బాగోతం బట్టబయలైంది. ఫర్టిలైజర్ డీలర్ల నుంచి అధికారులకు మామూళ్లు చెల్లిస్తున్నారనే ఆరోపణలకు సంబంధించిన ఓ చేతిరాత నోట్ సోషల్ మీడియాలో వైరల్ కావడం చర్చనీయాంశమైంది. దుకాణాల్లో జరుగుతున్న అవకతవకలను కప్పిపుచ్చేందుకు మామూళ్లు చెల్లించారని తెలుస్తోంది. ఈ నోట్లో వివిధ హోదాల్లో ఉన్న అధికారులు, కార్యాలయ సిబ్బంది, ఇతర వర్గాలకు నగదు చెల్లించినట్లు పే రొంటూ వివరాలు ఉండడం కలకలం రేపుతోంది.
ఇందులో 2025 అక్టోబర్ నెలలో ఏవోకు రూ.18 వేలు, డీఏవోకు రూ.15 వేలు, ఏవోకు రూ.3,700, ఏడీఏ ఆఫీస్ స్టాఫ్‌కు రూ.మూడు వేలు, డీఎవో ఆఫీస్ స్టాఫ్‌కు రూ.మూడు వేలు, ఫైర్ స్టేషన్‌కు రూ.1,000తో పాటు ఇతర ఖర్చులు కలిపి మొత్తం రూ.88,600 దసరా మామూలు చెల్లించినట్లు ఉంది. ఫర్టిలైజర్ షాపుల్లో జరుగుతున్న అవకతవకలు చూసీచూడనట్లు వదిలేయడం, తనిఖీల్లో సడలింపులు కల్పించడం కోసం ఈ తరహా వ సూళ్లు జరుగుతున్నాయనే ప్రచారం సాగుతోంది. రైతులతో నేరుగా సంబంధం ఉన్న వ్యవసాయ శాఖపై ఇటువంటి ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ చేతిరాత నోట్ లోని వివరాలపై జిల్లా ఉన్నతాధికారులు, అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) స్వతంత్ర విచారణ జరిపి నిజానిజాలను వెల్లడించాలని ప్రజలు కోరుతున్నారు.
తొర్రూరులోని ఫర్టిలైజర్ దుకాణాల అవకతవకలు బయటపడకుండా ఉండేందుకు కొందరు వ్యవసాయ అధికారులు మామూళ్లు తీసుకుంటున్నారని, వ్యవసాయ శాఖలో జరుగుతున్న అవి నీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని రైతు సంఘం మండల కార్యదర్శి కొత్త వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.
అనంతరం మీడి యాతో మాట్లాడుతూ ప్రతి సీజన్లో ఫర్టిలైజర్ డీలర్ల నుంచి వ్యవసాయ అధికారులు వేల రూ పాయలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయని తెలిపారు. అధికారుల అండదం డలతో కొందరు డీలర్లు రైతులకు అధిక ధరలకు విత్తనాలు, ఎరువులు విక్రయిస్తున్నారని ఆరో పించారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, అక్రమాలకు పాల్పడిన అధికారులు, ఫర్టి లైజర్ షాపుల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరినట్లు తెలిపారు.