Farmers Protest | కొనుగోలు కేంద్రాల నిర్లక్ష్యంపై రైతుల రాస్తారోకో
Farmers Protest | మహబూబాబాద్ జిల్లాలో మొక్కజొన్న పండించిన రైతులకు కష్టాలు మొదలయ్యాయి.
తొర్రూరు : మహబూబాబాద్ ( Mahabubabad ) జిల్లాలో మొక్కజొన్న పండించిన రైతులకు కష్టాలు మొదలయ్యాయి. సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలు(Procurement Centers ) ఏర్పాటు చేయకపోవడం, కాంటా వేయడంలో జాప్యం వంటి కారణాలతో జిల్లాలోని మార్కెట్ యార్డులు మొక్కజొన్నతో ( Maize ) నిండిపోయాయి.
గన్ని బ్యాగులు, లారీల కొరత తీవ్రంగా ఉండటంతో కొనుగోలు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో మార్కెట్ యార్డులన్నీ మక్క బస్తాలతో కిక్కిరిసిపోయి, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తొర్రూరు పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పరిస్థితి మరింత దారుణంగా మారింది. కాంటా వేసిన మొక్కజొన్నను పూర్తిస్థాయిలో తరలించకపోవడంతో రైతులు రోజులు తరబడి అక్కడే ఉండాల్సి వస్తోంది.
సుమారు 5వేల బస్తాల మక్క నిల్వ ఉండగా, లారీల కొరత కారణంగా వాటిని తరలించ లేకపోతున్నామని అధికారులు స్వయంగా చెబుతున్నారు. సుమారు 25 వేల గన్ని బ్యాగులు అవసరం ఉండగా, కేవలం 5000 బ్యాగులు మాత్రమే సరఫరా చేసినట్లు సమాచారం. ఈ పరిస్థితులపై ఆగ్రహం చెందిన రైతులు సోమవారం మహబూబాబాద్ ప్రధాన రహదారిపై మొద్దులు అడ్డంగా పెట్టి రాస్తారోకో చేపట్టారు. దీంతో రాకపోకలు పూర్తిగా స్థంభించాయి.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రైతులను శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ, రైతులు వెనక్కి తగ్గకుండా అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
DGP CV Anand | యూనిఫామ్‌లో డ్యాన్సులొద్దు.. పోలీసులకు డీజీపీ వార్నింగ్
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

