నర్సింహులపేట నవంబర్ 3 : కాంగ్రెస్ పాలనలో రైతులు ఒక్క యూరియా బస్తా కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద సోమవారం యూరియా కూపన్లు కోసం రైతుల బారులు తీరారు. ప్రైవేట్ దుకాణాల్లో యూరియా బస్తాలు వచ్చాయన్న సమాచారంతో రైతులు అక్కడికి
చేరుకున్నారు. దీంతో రైతులు ఎక్కువగా రావడంతో తోపులాట చోటు చేసుకుంది.
పలువురికి కూపన్లు అందించడంతో యూరియా అందని రైతులు నిస్సాయంగా వెనుదిరిగాడు. కూపన్లు ఇవ్వడం అయిపోవడంతో రైతులకు ఎలాంటి సమాధానం చెప్పకుండా అధికారులు అక్కడ నుండి వెళ్లిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు ఏఈవోలతో వాగ్వివాదానికి దిగారు. కాగా, యూరియా కొరత లేదని మరోవైపు అధికారులు పేర్కొనడం గమనార్హం.