వరంగల్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం రూ.2 లక్షల రు ణమాఫీని మూడు విడుతలుగా ప్రకటించినా వరంగ ల్ జిల్లాలోని అనేక గ్రామా ల్లో అత్యధిక మంది రైతుల కు వర్తించలేదు. కొన్ని ప్రా థమిక వ్యవసాయ సహకా ర సంఘా(పీఏసీఎస్)ల పరిధి లో వంద శాతం మంది రైతులు మాఫీని పొందలేకపోయారు. జాతీయ బ్యాంకుల నుంచి రుణం పొందిన కొద్ది మందికి మాత్రమే మాఫీ వర్తించింది.
ఇలాంటి గ్రామాల్లో సంగెం మండలంలోని చింతలపల్లి ఒకటి. చింతలపల్లి కేంద్రంగా పనిచేస్తున్న పీఏసీఎస్ పరిధిలో చింతలపల్లి, పల్లారుగూడ, మొండ్రాయి, కుంటపల్లి, కృష్ణానగర్ గ్రా మాలుండగా, వాటిలోని 644 మంది రైతులు 2016, 2017లో సుమారు రూ.3.77 కోట్ల రుణాలు పొందారు. ఆ తర్వాత వీరి రుణాలను అధికారులు రెన్యువల్ చేయకపోవడంతో రుణమాఫీకి వారు అర్హులు కాలేదు.
చింతలపల్లి పీఏసీఎస్ ద్వారా రుణాలు తీసుకున్న 644 మంది రైతులు 2018 డిసెంబర్ 12 లోపు రుణం పొందారు. ప్రభుత్వం రుణమాఫీ ద్వారా మొదటి విడుత రూ.లక్ష రుణాలను మాఫీ చేసిన సమయంలోనే వీరిలో అనేక మంది పేర్లు మాఫీ జాబితాలో లేకపోవడంతో సొసైటీ కార్యాలయ సిబ్బందిని నిలదీయడంతో అసలు విషయం తెలిసింది. రుణాలను రెన్యువల్ చేయకపోవటం వల్లే తాము రుణమాఫీని కోల్పోవాల్సి వచ్చిందని వ్యవసాయ, సహకారశాఖ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్‌ను కలిశారు. 644 మందిలో చింతలపల్లి గ్రామ రైతు లే 570 మంది ఉన్నారు. కాగా, ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన అధికారులు రుణమాఫీ పథకం అమల్లోకి రాకముందే చింతలపల్లి పీఏసీఎస్ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు వేశారు.
చింతలపల్లి గ్రామంలో సుమారు 720 మంది రైతులుండగా, వీరిలో 570 మంది పీఏసీఎస్ ద్వారా రుణాలు పొందగా వారికి మాఫీ వర్తించలేదు. సంగెం, వరంగల్‌లోని గ్రామీణ వికాస్, యూనియన్ తదితర జాతీయ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న మిగతా 150 మందికి మాఫీ వర్తించింది.
రుణమాఫీ వర్తించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన చింతలపల్లి పీఏసీఎస్ చైర్మన్, సీఈవోలపై చర్యలు తీసుకోవాలి. మా సొసైటీ సభ్యులకు రూ.3.77 కోట్ల రుణం మాఫీ కావాల్సి ఉండగా వారి వల్ల రుణమాఫీని కోల్పోయాం. 30 మంది రైతులు రుణానికి సంబంధించి రూ.14 లక్షలు చెల్లిస్తే చై ర్మన్, సీఈవో ఆ డబ్బును వారి సొంతానికి వాడుకున్నారు. ధాన్యం రవాణా ఛార్జీలు రూ.3 లక్షలు, రేషన్‌కు సంబంధించి నెలకు రూ.16 వేల చొ ప్పున వచ్చే డబ్బు లెక్కలను కూడా చూపడం లేదు. రుణమాఫీ వర్తించని రైతులందరం కలిసి సంఘటితంగా పోరాడుతాం. మా రుణాలు మాఫీ అయ్యేవరకు ఆందోళన చేస్తాం.
– వేల్పుల ఐలయ్య, రైతు, చింతలపల్లి