గిర్మాజీపేట, సెప్టెంబర్ 6: తమకు ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పాలని రైతులు శుక్రవారం వరంగల్ జేపీఎన్ రోడ్లోని కెనరా బ్యాంకు ఎదుట పురుగుల మందు డబ్బాలతో ఆందోళన చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హా మీ మేరకు ఎలాంటి షరతులు లేకుండా అర్హులైన రైతులందరికీ రూ. 2 లక్షలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.