నర్సింహులపేట, ఆగస్టు 28 : అన్నదాతను పెసర పంట కో లుకోలేని దెబ్బ తీసింది. అధిక దిగుబడి వస్తుందన్న ఆశతో సాగు చేస్తే ఏపుగా ఎదిగిందే తప్ప.. పూత.. కాత లేక నష్టాల పాలు చేసింది. రైతులకు నకిలీ విత్తనాలు, నిషేధిత పురుగు మందులు విక్రయిస్తే పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని డీలర్లను ఉన్నతాధికారులు హెచ్చరించినప్పటికీ, కిందిస్థాయి సిబ్బంది పట్టింపులేని తనంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.
కాలం కలిసి రాక.. అరకొర వర్షాలతో అష్టకష్టాలు పడు తూ పెసర పంట సాగుచేస్తే కిలో గింజలు వచ్చే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రూప్లాతండా గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రచకృతండాకు చెందిన రైతులు తెలంగాణ సీడ్స్‌కు చెందిన మధిర 385రకం పెసర విత్తనాలను సుమా రు 100 ఎకరాల్లో సాగు చేశారు. పెసర పంటను ముందుగా సాగు చేస్తే ఎక్కువ దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు చెప్పిన మాటలను నమ్మి నాలుగు కేజీల విత్తన ప్యాకెట్‌ను రూ. 550కి ఆగ్రోస్ కేం ద్రంలో కొనుగోలు చేశారు.
ఏపుగా పెరిగిన పంట చేతికొస్తుందనుకున్న దశలో పూత, కాత లేకపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. ఇదే సమయంలో ఇతర రకాలు సాగు చేసిన రైతుల పంట పూత, కాతతో కళకళలాడుతున్నది. నకిలీ విత్తనాల విక్రయానికి సంబంధించి గతేడాది అధికారులు 19 కేసులు నమోదు చేసినప్పటికీ సీడ్స్ వ్యాపారుల్లో మార్పు రావడం లేదు. దీంతో రైతు లు తమ పెసర పంటను వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఎకరానికి సుమారు రూ. 30వేల వరకు నష్టం వాటిల్లిందని వా రు ఆవేదన చెందుతున్నారు. కాగా,ఈ రకం విత్తనాలు సాగు చేసిన జిల్లాలోని రైతులందరి పరిస్థితి ఇలాగే ఉన్నట్లు తెలిసింది.