ప్రతికూల వాతావరణం, పెరిగిన పెట్టుబడులు, అందని మద్దతు ధర వెరసి పెసర రైతులు దిగాలు చెందుతున్నారు. ఈ ఏడాది వానకాలం కొణిజర్ల మండల వ్యాప్తంగా సుమారు వెయ్యి ఎకరాలకు పైగా రైతులు పెసర పంట సాగు చేశారు.
అన్నదాతను పెసర పంట కో లుకోలేని దెబ్బ తీసింది. అధిక దిగుబడి వస్తుందన్న ఆశతో సాగు చేస్తే ఏపుగా ఎదిగిందే తప్ప.. పూత.. కాత లేక నష్టాల పాలు చేసింది. రైతులకు నకిలీ విత్తనాలు, నిషేధిత పురుగు మందులు విక్రయిస్తే పీడీ