ఎల్కతుర్తి, జూలై 8: వానకాలం ఆరంభంలోనే రైతులకు యూరియా తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికే అరకొరగా పడుతున్న వర్షాలతో ఆరుతడి పంట అయిన పత్తిని రైతులు సాగు చేశా రు. పత్తి మొక్క దశలో ఉండగా, ఏపుగా పెరిగేందు కు యూరియా, ఇతర కాంప్లెక్స్ ఎరువులను వేయా ల్సి ఉంది. నీళ్లు ఉన్న రైతులు నారుమడులు పోసుకొ ని, పొలాలను కూడా దున్నుకుంటున్నారు. అయితే యూరియా కోసం ఇటు సహకార సొసైటీ, ఫర్టిలైజర్ షా పుల చుట్టూ తిరుగుతున్నా యూరియా దొరకని పరిస్థితి ఉంది.
ఈ క్రమంలోనే హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి విశా ల సహకార సొసైటీ వద్ద మంగళవారం రైతులు తమ చెప్పులను క్యూలో పెట్టి యూరియా కోసం పొద్దంతా ఎదురుచూశారు. 2 ఎకరాలకు ఒకే బస్తా ఇస్తామని చెప్పి, అది కూడా రోజుకు 100 బస్తాలు మాత్రమే విక్రయిస్తున్నారు. యూ రియా తీసుకెళ్లిన రైతులకు మళ్లీ నెల రోజుల వరకు ఇవ్వద్దని పైఅధికారుల ఆదేశాలున్నట్లు సమాచారం. దీంతో రైతు లు ఇబ్బందులు పడుతున్నారు. అసలే పంటలు పెరిగే దశలో యూరియా వేయకపోతే దిగుబడి తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.