TFCC | నిర్మాతలు-డిస్ట్రిబ్యూటర్ల వివాదంలో TFCC కీలక నిర్ణయం .. రాతపూర్వక ఒప్పందాలు తప్పనిసరి
TFCC | తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య జరుగుతున్న వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇరు వర్గాల మధ్య జరిగే లావాదేవీలకు రాతపూర్వక ఒప్పందం తప్పనిసరి అని స్పష్టం చేసింది. రాతపూర్వక ఒప్పందం లేకుండా వచ్చే ఫిర్యాదులను స్వీకరించబోమని ఛాంబర్ ప్రకటించింది.
TFCC | తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య జరుగుతున్న వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇరు వర్గాల మధ్య జరిగే లావాదేవీలకు రాతపూర్వక ఒప్పందం తప్పనిసరి అని స్పష్టం చేసింది. రాతపూర్వక ఒప్పందం లేకుండా వచ్చే ఫిర్యాదులను స్వీకరించబోమని ఛాంబర్ ప్రకటించింది.ఇటీవల ఫిల్మ్ ఛాంబర్‌కు నిర్మాతలు, పంపిణీదారుల నుంచి వివాదాలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే ఎక్కువగా మౌఖిక ఒప్పందాలే ఉండటంతో వాటిని పరిష్కరించడం కష్టంగా మారుతోంది. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని టాలీవుడ్ వ్యాపార వ్యవహారాల్లో క్రమశిక్షణ తీసుకురావాలనే ఉద్దేశంతో TFCC ఈ నూతన విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.
జనవరి 29, 2026న జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఈ అంశంపై విస్తృతంగా చర్చించిన అనంతరం, రాతపూర్వక ఒప్పందం లేకుండా జరిగిన లావాదేవీలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులను నమోదు చేయకూడదని, ప్రాసెస్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై లావాదేవీ జరిగిన 15 రోజుల్లోపు అమలు చేసిన ఒప్పందం కాపీని ఫిర్యాదుతో పాటు సమర్పించాల్సి ఉంటుంది. లేకపోతే ఆ ఫిర్యాదును పరిశీలించబోమని ఛాంబర్ స్పష్టం చేసింది.
సరైన డాక్యుమెంటేషన్ లేకుండా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటే ఇరుపక్షాల బాధ్యత తమది కాదని, ప్రతి ఒప్పందం స్వంత బాధ్యతతోనే చేసుకోవాలని TFCC హెచ్చరించింది. ఈ నిర్ణయాన్ని ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి స్వాగతిస్తూ, ఇది నిర్మాతలు మరియు డిస్ట్రిబ్యూటర్లను రక్షించడమే కాకుండా భవిష్యత్తులో వచ్చే వివాదాలను తగ్గించడంలో సహాయపడుతుందని అభిప్రాయపడ్డారు. గతంలో మౌఖిక ఒప్పందాల వల్ల అనేక సమస్యలు ఎదురయ్యాయని, ఇప్పుడు ఈ నిర్ణయం పరిశ్రమకు మేలు చేస్తుందని తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

