Mahesh Babu | చిన్న సినిమాలకు సూపర్ స్టార్ మద్దతు .. ‘యుఫోరియా’పై మహేష్ బాబు ప్రశంసలు
Mahesh Babu |సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘వారణాసి’ షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అంత బిజీ షెడ్యూల్ మధ్య కూడా ఆయన ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ రూపొందించిన తాజా చిత్రం ‘యుఫోరియా’ను వీక్షించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
Mahesh Babu |సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘వారణాసి’ షూటింగ్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అంత బిజీ షెడ్యూల్ మధ్య కూడా ఆయన ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ రూపొందించిన తాజా చిత్రం ‘యుఫోరియా’ను వీక్షించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఒక స్టార్ హీరో చిన్న సినిమాలకు సమయం కేటాయించి ప్రోత్సహించడం పట్ల సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.సినిమా చూసిన అనంతరం మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
గుణశేఖర్ గారు కథలను ప్రెజెంట్ చేసే విధానం ఎప్పుడూ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సినిమా నాకు చాలా నచ్చింది. ముఖ్యంగా క్లైమాక్స్‌ను తీర్చిదిద్దిన తీరు అద్భుతంగా అనిపించింది. ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన సినిమా ఇది. గుణశేఖర్ గారికి, భూమిక చావ్లాకు మరియు యుఫోరియా టీమ్ మొత్తానికి అభినందనలు” అంటూ ట్వీట్ చేశారు. మహేష్ బాబు వంటి స్టార్ హీరో నుంచి వచ్చిన ఈ ప్రశంసలు చిత్ర యూనిట్‌కు భారీ బూస్ట్‌గా మారాయి. ‘యుఫోరియా’ చిత్రం ద్వారా సారా అర్జున్ తెలుగులో హీరోయిన్గా పరిచయమవుతుండగా, విఘ్నేష్ గవిరెడ్డి హీరోగా తొలి అడుగు వేశారు. ఈ ఇద్దరి నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో వారి నటన ఆకట్టుకుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సీనియర్ నటి భూమిక చావ్లా కీలక పాత్రలో నటించడం సినిమాకు అదనపు బలంగా మారింది.
ఈ చిత్రాన్ని నీలిమ గుణ, యుక్త గుణ సంయుక్తంగా నిర్మించగా, సంగీతాన్ని కాల భైరవ అందించారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరియు పాటలు కథా ప్రవాహానికి బాగా సరిపోయాయని ప్రేక్షకులు చెబుతున్నారు. కంటెంట్ ఆధారిత సినిమాలకు మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలు మద్దతు ఇవ్వడం తెలుగు సినీ పరిశ్రమకు శుభ సూచకమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చిన్న సినిమాలకు పెద్ద హీరోల అండ ఉంటే కొత్త ప్రతిభ వెలుగులోకి వస్తుందనే నమ్మకాన్ని ఈ ఘటన మరోసారి బలపరిచింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | ‘రణబాలి’ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌కు ముహూర్తం ఫిక్స్.. ఎక్కడంటే?
Mercedes Benz | హైదరాబాద్‌లో మహావీర్ మోటార్స్ సరికొత్త రికార్డ్.. దసరా కానుకగా 50 మెర్సిడేస్ బెంజ్ కార్ల డెలివరీ.. !
Odisha Athletes | కటక్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు ఒడిశా అథ్లెట్ల మృతి.. సీఎం సంతాపం
Annamalai | ‘12 ఏళ్లుగా అధికారంలో ఉన్నా, శతృవులను సృష్టించుకోవాల్సి వస్తున్నది’.. బీజేపీపై అన్నామలై విమర్శలు
NZvIND: గ్లెన్ ఫిలిప్స్ 82 నాటౌట్.. ఇండియా టార్గెట్ 226
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

