గూడూరు, జూలై 31: స్థానిక యూనియన్ బ్యాంకు లో బుధవారం నెట్వర్క్ లేకపోవడంతో కస్టమర్లు, రైతులు ఇబ్బందులు పడ్డారు. బ్యాంకు ముందున్న సర్వర్ సమస్య ఉందని కస్టమర్లు గమనించాలని బ్యాంకు ఉద్యోగులు బోర్డు పెట్టారు.
దీంతో లావాదేవీలు చేసేందుకు కస్టమర్లు ఇబ్బందులు పడ్డారు. రుణమాఫీ పొందిన రైతులు ఎంత మొత్తంలో అయ్యిందో తెలుసుకోవాలని, రుణమాఫీకి సంబంధించిన కటాఫ్ డేట్ నుంచి ఈనెల వరకు వడ్డీ చెల్లించాలనుకున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.