ఐనవోలు( హనుమకొండ): యూరియా కొరత రైతులను వేధిస్తూనే ఉంది. డిమాండ్‌కు తగిన యూరియా సకాలంలో రాకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నాట్లు వేసిన, పత్తి మొక్కలకు కాయలు పడే సమయంలో యూరియా సకాలంలో తప్పనిసరిగా వేయాలి. ఈ క్రమంలో రైతులు యూరియా కోసం వ్యవసాయా కార్యాలయాలు, సొసైటి కార్యాయాలు, ఎరువుల దుకాణాల చుట్టూ తిరగ్సాలి వస్తుంది. నందనం సొసైటీకి బుధవారం 10 టన్నుల యూరియా మాత్రమే వచ్చింది.
సుమారుగా 220 బస్తాల యూరియా మాత్రమే వచ్చింది. యూరియా కోసం రైతు వేదిక వద్దకు ఎక్కువ సంఖ్యలో వచ్చారు. దీంతో ఏవో సునిల్ మార్, సొసైటి సిబ్బంది, పోలీసు సహకారంతో ఒక రైతు ఒక బస్తా మాత్రమే పంపిణీ చేశారు. కొంత మంది రైతులకు యూరియా బస్తా రాకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.