మరిపెడలో వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు ప్రతిపాదనలకే పరిమితమైంది. 2020 సంవత్స రంలో బీఆర్ఎస్ హయాంలో ప్రపోజల్స్ పంపగా అప్పటి ప్రభుత్వం బురహాన్‌పురం గ్రామ పరిధిలో 9.25 ఎకరాల భూమిని కేటాయించింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుంది. వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలోని కేసముద్రం మార్కెట్‌కు వెళ్లి వ్యయ ప్రయాసలకు గురవుతున్నట్లు రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నది. వెంటనే మరిపెడలో మార్కెట్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నది.
– మరిపెడ, జనవరి 19
కేసముద్రం, మరిపెడ మండలాల పరిధిలోని గ్రామాలను కలిపి కేసముద్రం మారెట్ను 1960 సంవత్సరం లో ఏర్పాటు చేశారు. మరిపెడలో చెక్‌పోస్ట్, సబ్ యార్డ్ అందుబాటులోకి తీసుకొచ్చారు. కేసముద్రం వ్యవసా య మారెట్‌కు ఏటా లభిస్తున్న ఆదాయంలో మూడో వంతు ఈ చెక్‌పోస్ట్ ద్వారానే వస్తున్నది. మహబూబాబాద్, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల సరిహద్దు, జాతీ య, రాష్ట్ర రహదారుల కలయికతో వందలాది మంది రాకపోకలతో రద్దీగా ఉండే మరిపెడలో వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేస్తే అందుబాటులో ఉంటుందని రైతుల నుంచి డిమాండ్ వచ్చింది. వ్యవసాయ ఉత్పత్తు లను వేరే ప్రాంతాలకు వెళ్లి విక్రయించాల్సిన పనిలే కుండా, సమయం, ఆర్థికంగా కలిసి వస్తుందని అభిప్రా యాలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కృషితో 2020 సంవత్సరంలో మరిపెడలో మారెట్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపగా, మే 18న అప్పటి ప్రభుత్వం బురహాన్‌పురం గ్రామ పరిధిలో 161/1/2 సర్వే నంబర్లో 9.25 ఎకరాల భూమిని కేటాయించింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 21 అక్టోబర్ 2024న మార్కెట్ ఏర్పాటు చేస్తే నియమించాల్సిన ఉద్యోగులు, చేర్చాల్సిన గ్రామాలు, పంట సాగు విస్తీర్ణం, ఆదాయం, వ్యాపారులు, మిల్లులు ఇతరత్రా వ్యవసాయ ఆధారిత పరిశ్రమల వివరాలతో సమగ్ర రిపోర్టు అందజేయాలని వ్యవసాయ మారెటింగ్ శాఖ డైరెక్టర్ కేసముద్రం మార్కెట్ కార్యదర్శిని ఆదేశించారు.
నివేదిక సిద్ధం చేస్తున్నాం..
వ్యవసాయ మారెటింగ్ శాఖ నుంచి ఇప్పటివరకు సబ్ యార్డ్‌గా ఉన్న మరిపెడలో కొత్తగా మారెట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి సమగ్ర నివేదిక అందించాలని డైరెక్టర్ ఆఫ్ మారెటింగ్ శాఖ నుంచి ఉత్తర్వులు అందినట్లు కేసముద్రం మారెట్ కార్యదర్శి అమరలింగేశ్వర రావు చెప్పారు. అందుకోసం నివేదిక సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.