రోడ్డెక్కిన లక్ష్మక్కపల్లి రైతులు
ధాన్యం కొనుగోళ్లు నత్తనడక సాగుతుండడంతో విసిగిపోయిన రైతులు శుక్రవారం కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. వానకాలం సమీపించిందని, వడ్లు ఇంకెప్పుడు కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు.
- ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని డిమాండ్
కొడకండ్ల, జూన్ 5 : ధాన్యం కొనుగోళ్లు నత్తనడక సాగుతుండడంతో విసిగిపోయిన రైతులు శుక్రవారం కొడకండ్ల మండలం లక్ష్మక్కపల్లి గ్రామంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. వానకాలం సమీపించిందని, వడ్లు ఇంకెప్పుడు కొంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా వర్షం కురిస్తే చేతికొచ్చిన పంట ఆగమవుతుందన్నారు. అప్పుడప్పుడు కురుస్తున్న వానలకు కొనుగోలు కేంద్రంలో నింపిన వడ్ల బస్తాలు తడిసిముద్దవుతున్నాయని అన్నారు. వెంటనే కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు. రైతులు రోడ్డుపై బైఠాయించడంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది.
సమాచారం అందుకున్న స్థానిక నాయకులు, అధికారులు చేరుకొని రైతులతో మాట్లాడే ప్రయత్నం చేసినా రైతులు వినలేదు. తాము పండించిన ప్రతి గింజనూ మద్దతు ధరతో త్వరగా కొనుగోలు చేసి, తూకం వేసి వెంటనే మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో తహసీల్దార్ ఘటనా స్థలానికి చేరుకొని, ఆందోళన చేస్తున్న రైతుల మధ్యే కూర్చొని ఫోన్లో జిల్లా ఉన్నతాధికారులతో మాట్లాడారు. లక్ష్మకపల్లి కొనుగోలు కేంద్రంలో పేరుకుపోయిన ధాన్యం తరలింపునకు వెంటనే అదనపు లారీలను పంపాలని, కాంటాలు వేగవంతం చేయాలని కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వర్షాలతో పంట నష్టపోకుండా రక్షణ చర్యలు తీసుకుంటామని, ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేస్తామని రైతులకు స్పష్టమైన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

